కేజ్రీవాల్ కు మోదీ భయపడుతున్నారు: ఎంపి సంజయ్ రౌత్

కేజ్రీవాల్ కు మోదీ భయపడుతున్నారు: ఎంపి సంజయ్ రౌత్

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భయపడుతున్నారన్నారు శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీ నిర్వహిస్తోందని.. మేమంతా నిరసన ర్యాలీలో పాల్గొంటామని చెప్పారు. 

ఈ మేరకు సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ..  సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చారు. స్వాతంత్ర్య పోరాట సమయంలోనూ జైలుకు వెళ్ళిన నాయకులు మరింత బలంగా తిరిగి వచ్చారన్నారు.  ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్‌ అంటే భయం పట్టుకుందన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మరింత ప్రమాదకర మారుతారని చెప్పారు. ఇప్పుడు కేజ్రీవాల్ జైలు నుంచే పనిచేస్తారు.. కాబట్టి, ప్రజలు ఆయన మాట విని మద్దతుగా నిలుస్తారని అన్నారు. ఇక, లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై స్పందిస్తూ..  తొలి జాబితాలో 15 నుంచి 16  అభ్యర్థులను శివసేన(యుబిటి) మంగళవారం ప్రకటిస్తుందని  సంజయ్ రౌత్  చెప్పారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉంటూనే పరిపాలనను కొనసాగిస్తున్నారు.