
త్వరలో మేకిన్ ఇండియా ట్యాగ్ తో తయారు చేయబడిన విమానాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లో తయారు చేయబడే విమానాలు సైన్యానికి కొత్త శక్తిని అందించడమే కాకుండా..విమానాల తయారీలో కొత్త నిర్మాణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తాయన్నారు. గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. వడోదరలో సీ–295 విమానాల తయారీ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నరంగంలో విమానయాన రంగం ఒకటని మోడీ తెలిపారు. త్వరలో ఎయిర్ ట్రాఫిక్ పరంగా టాప్ 3 దేశాల జాబితాలోకి భారత్ ప్రవేశించబోతోందన్నారు. రాబోయే పదేండ్లల్లో దేశానికి 2 వేలకుపైగా కార్గో విమానాలు అవసరమవుతాయని మోడీ వెల్లడించారు.