100 కోట్ల ప్రజల.. వెయ్యేళ్ల కలను నిర్మించే బాధ్యత నాది : మోదీ

100 కోట్ల ప్రజల.. వెయ్యేళ్ల కలను నిర్మించే బాధ్యత నాది : మోదీ

2024 ఎన్నికల్లో పాత రికార్డులన్నీంటిని బద్దలు కొట్టి మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రధాని మోదీ అన్నారు. 2018లోనూ తమపై విపక్షాలు  అవిశ్వాసం పెట్టాయని..అయినా ఆ తర్వాత ప్రజలు తమపై విశ్వాసం ఉంచి..మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు. నాటి ఎన్నికల్లో బీజేపీకి, ఎన్డీఏకి ఓట్లు, సీట్లు పెరిగాయన్నారు. విపక్షం పెట్టిన అవిశ్వాసం తమపై కాదు..వాళ్లపై వాళ్లే పెట్టుకున్నరని మోదీ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల అవిశ్వాసం తమకు శుభదాయకమన్నారు.  అవిశ్వాసం పెట్టమని దేవుడు ప్రతిపక్షాలకు చెప్పి ఉంటారని చురకలంటించారు.

ఈ సమావేశాల్లో ఇప్పటి వరకు అనేక బిల్లులు ప్రవేశపెట్టామని ప్రధాని మోదీ తెలిపారు.  డిజిటల్ డేటా ప్రొటక్షన్ బిల్లు దేశ యువతకు సంబంధించిందని... డేటాను సేకండ్ ఆయల్, సెకండ్ గోల్డ్ గా భావిస్తున్నారని చెప్పారు. కానీ ఇవేమి  విపక్షానికి పట్టవని విమర్శించారు. వారికి కేవలం రాజకీయాలే కావాలని మండిపడ్డారు.  జనం అకాంక్షకు విపక్షాలు తూట్లు పొడిచాయన్నారు. ప్రజలకు విపక్షాలు నమ్మక ద్రోహం చేశాయన్నారు. 

విపక్షాలకు అధికార దాహం పెరిగిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఆకలి వీరికు పట్టదని చురకలంటించారు. ఫీల్డింగ్ చేసింది ప్రతిపక్షాలే అయినా..కానీ తమ వైపు నుంచి ఫోర్లు, సిక్సులు నుంచి పడ్డాయన్నారు. నో కాన్ఫిడెన్స్  నో బాల్ గానే సాగిందన్నారు.  ఐదేళ్ల సమయం ఇచ్చినా విపక్షాలు సిద్ధం కాలేదని చురకలంటించారు. ఏంటో వాళ్ల దరిద్రం తనకు అర్థం కావడం లేదన్నారు.