
ప్రధాని మోదీ ప్రభుత్వంపై లోక్ సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్లే దేశానికి హానికి కలుగుతుందని ఆరోపించారు. దేశం కంటే హిందుత్వమే ప్రధాని మోదీకి ముఖ్యమైందని విమర్శించారు. సభలో హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఒవైసీ ఖండించారు. క్విట్ ఇండియా గురించి అమిత్ షా మాట్లాడుతున్నారు. ఆ పదం మొదట ఉపయోగించింది ఓ ముస్లిం.. ఈ విషయం తెలిస్తే అమిత్ షా ఆ పదాన్ని ఉపయోగించరేమో అని అన్నారు. ప్రధాని మోదీ ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నారని అసదుద్దీన్ ఆరోపించారు. ముస్లింలకు కేటాయించాలని నిధుల్లో కోత పెట్టారని అన్నారు. స్త్రీ రక్షణ గురించి మాట్లాడుతున్న మోదీ.. గుజరాత్ లో బిల్కిస్ బానో ఎందుకు న్యాయం చేయట్లేదని ఎంపీ అసదుద్దీన్ అన్నారు.
#WATCH | AIMIM MP Asaduddin Owaisi, says "Our Home Minister was talking about 'Quit India' yesterday. I wonder if he gets to know that the word 'Quit India' was coined by a Muslim, he will not use this word. I want to say that the kind of politics you (Central govt) are doing… pic.twitter.com/KCKREpl5Hl
— ANI (@ANI) August 10, 2023