క్యాతనపల్లిలో హై టెన్షన్.. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కార్లపై బీఆర్ఎస్ రాళ్ల దాడి

క్యాతనపల్లిలో హై టెన్షన్.. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కార్లపై  బీఆర్ఎస్ రాళ్ల దాడి

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా.. క్యాతనపల్లిలో హై టెన్షన్. 2026, ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి.. మున్సిపల్ ఆఫీసుకు వస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణపై బీఆర్ఎస్ గూండాలు తెగబడ్డారు. మంత్రి, ఎంపీ కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ల అనుచరుల దాడిలో మంత్రి, ఎంపీ కాన్వాయ్ లోని కార్ల అద్దాలు పగిలాయి. 

16వ తేదీన కోరం లేకపోవటంతో ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలోనే అధికారులు 17వ తేదీ.. అంటే ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం మంత్రి, ఎంపీ.. ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మున్సిపల్ ఆఫీసుకు వస్తున్న సమయంలో.. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత బాల్క సుమన్.. అతని అనుచరులు రౌడీలుగా వ్యవహరించారు. గూండాగిరికి దిగారు. క్యాతనపల్లి మున్సిపాలిటీకి వస్తున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కార్లపై రాళ్లతో దాడి చేశారు. 

మార్గమధ్యలో మంత్రి, ఎంపీ వెళుతున్న దారిలో ట్రాఫిక్ బారికేడ్లు అడ్డంగా పెట్టారు. బారీగేడ్లు కారణంగా వాహనాల స్పీడ్ తగ్గటం.. ఆ వెంటనే బాల్క సుమన్, అతని అనుచరులు మంత్రి, ఎంపీ కార్లపై రాళ్ల విసిరారు. ఈ దాడిలో మంత్రి, ఎంపీ కార్ల అద్దాలు పగిలాయి. బీఆర్ఎస్ రాళ్ల దాడి నుంచి మంత్రి, ఎంపీ సురక్షితంగా బయటపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీ వాళ్లు దుర్మార్గంగా.. అనైతికంగా వ్యవహరించటం.. రౌడీలు, గూండాలు మాదిరి పట్టపగలు.. నడిరోడ్డుపై రాళ్లతో దాడులు చేయటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి, ఎంపీలపైనే బీఆర్ఎస్ వాళ్లు ఇలా రాళ్లతో విరుచుకుపడటంతో.. క్యాతనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. మంత్రి, ఎంపీ కార్లపై రాళ్ల దాడి తర్వాత పోలీసులు హై అలర్ట్ అయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిసరాల్లో బందోబస్తు పెంచారు.