నటి ప్రత్యూష కేసు ఏంటీ.. 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. ఆమె ఎలా చనిపోయింది..!

నటి ప్రత్యూష కేసు ఏంటీ.. 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. ఆమె ఎలా చనిపోయింది..!

సినీ నటి ప్రత్యూష... ఇప్పటి తరానికి ఈ పేరు తెలియకపోవచ్చు కానీ.. 90s లో కిడ్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. చేసిన కొన్ని సినిమాలతోనే అప్పటి యూత్ గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది ప్రత్యూష. 2002 లో సినీ నటి ప్రత్యూష అత్యాచారం, మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గత 24 ఏళ్లుగా విచారణ జరుగుతోన్న ఈ కేసులో మంగళవారం ( ఫిబ్రవరి 17 ) తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. దీంతో ప్రత్యూష కేసు మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ప్రత్యూష ఎవరు..? ఎలా చనిపోయింది.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రత్యూష ఎలా చనిపోయిందంటే:

ప్రత్యూష హీరోయిన్ గా తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్దార్థ రెడ్డితో ప్రేమలో పడింది. సిద్దార్థ రెడ్డి ఫ్యామిలీ వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ప్రత్యూష, సిద్దార్థ రెడ్డి ఇద్దరూ ఫిబ్రవరి 23, 2002లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సిద్దార్థరెడ్డి ప్రాణాలతో బయటపడగా.. ప్రత్యూష మరణించింది. ఈ క్రమంలో ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించిన సిద్దార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, 2011లో శిక్షను రెండేళ్లకు తగ్గించింది కోర్టు.

ALSO READ : నటి ప్రత్యూష కేసు : నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు

కోర్టు తీర్పుతో నిరాశ చెందిన ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రత్యూషది ఆత్మహత్య కాదని.. ప్లాన్ చేసిన మర్డర్ అంటూ పిటిషన్లో పేర్కొంది సరోజినీ దేవి. సుమారు 24 ఏళ్ళ పాటు ఈ కేసు విచారణ జరిగిన తర్వాత ఇవాళ తుది తీర్పు వెల్లడించింది కోర్టు. సిద్దార్థరెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్ధించింది. సిద్దార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

ప్రత్యూష కెరీర్:

ప్రత్యూష 1988లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రత్యూష ఆ తర్వాత అనతి కాలంలోనే హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. కలుసుకోవాలని, రాయుడు, సముద్రం వంటి సినిమాలతో హీరోయిన్ గా తన సత్తా చాటింది ప్రత్యూష. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది ప్రత్యూష. హీరోయిన్ గా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ప్రత్యూష హఠాన్మరణం ఆమె కుటుంబంలోనే కాకుండా అభిమానులకు కూడా తీవ్ర విషాదం మిగిల్చింది.