ప్రధాని మోడీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని

ప్రధాని మోడీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని

ఎగ్జామ్స్ సమయంలో ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో ఇవాళ ప్రధాని మోడీ  విద్యార్థులతో పరీక్ష పే చర్చ నిర్వహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. అయితే ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ స్కూల్ కు చెందిన అక్షర  బహు బాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలని  మోడీని  ప్రశ్నించింది.

దీనికి బదులిచ్చిన ప్రధాని మోడీ.. కార్మికులు నివసించే బస్తీలో ఓ చిన్నారిని ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఓ 8 ఏండ్ల చిన్నారి  మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాల్ ,తమిళ్ మాట్లాడటం తనను ఆశ్యర్యపరిచిందన్నారు. అయితే ఆ చిన్నారికి అన్ని భాషలు ఎలా వచ్చాయని ఆరా తీశానని మోడీ చెప్పారు. ఆ చిన్నారి ఇంటి పక్కన ఉండే వాళ్లు ఒక్కో ఫ్యామిలీ ఒక్కో రాష్ట్రానికి చెందిన వారని.. ఇలా ఎక్కడి నుంచో వచ్చిన వారు ఒకే దగ్గర నివసించడంతో  ఆ చిన్నారి అన్ని భాషలు నేర్చుకుందని చెప్పారు. భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా క్వాలిఫికేషన్స్ అవసరం లేదని.. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలని మోడీ తెలిపారు.