శంకరపట్నం, వెలుగు : అనారోగ్యంతో చనిపోయిన యువకుడిని కుటుంబ సభ్యులు తోపుడి బండిపైనే ఇంటి వరకు తీసుకెళ్లారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఆదివారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన వీరయ్య, రుక్కమ్మ కేశవపట్నం మెయిన్ రోడ్డు వద్ద ఓ గదిని అద్దెకు తీసుకొని అరటి పండ్లు అమ్ముతూ జీవిస్తున్నారు. వీరి కొడుకు యాకుబ్ (34) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. డెడ్‌బాడీని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ సొంతింటికి తీసుకెళ్లేందుకు వాహనాల కోసం ప్రయత్నించారు. ఎవరూ రాకపోవడంతో యాకూబ్ తల్లిదండ్రులు తప్పనిపరిస్థితిలో తోపుడుబండిపైనే డెడ్‌బాడీని ఇంటికి తీసుకెళ్లారు.
