- ఆ తర్వాత దళిత క్రిస్టియన్లు, బీసీలు, దళితులు
- గ్రామ స్థాయిల్లో ‘ఇంగ్లిష్’ స్కూల్స్ పెరిగితేనే అభివృద్ధి
- రిజర్వేషన్లు వందేండ్లు ఉన్నా ఇంగ్లిష్ రాకపోతే అంతే
- బీఆర్ఎస్ పిలుపు మేరకు నో క్యాస్ట్ అని చెప్పారని డౌటొస్తున్నది
- క్యాస్ట్ సర్వే రిపోర్టుపై ‘రౌండ్ టేబుల్’ సమావేశం
పంజాగుట్ట, వెలుగు: రాష్ట్రంలో ఇంగ్లిష్ భాషలో చదువుకున్న అగ్ర కులాలే అన్ని రంగాల్లో ముందున్నాయని తమ సర్వేలో తేలిందని ప్రొఫెసర్కంచ ఐలయ్య షెపర్డ్అన్నారు. క్యాస్ట్సర్వేలో భాగంగా తాము ఇంగ్లిష్ మీడియం చదువు ఏ కులానికి ఎక్కువ దక్కుతుందని సర్వే చేయగా.. ముందు బ్రాహ్మణులు 77 శాతం తర్వాత, కోమట్లు, వైశ్యులు, వెల్మలు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. వీరి తర్వాత రాజులు, రెడ్డి, తర్వాత బీసీ సీ అంటే దళిత క్రిస్టియన్లు ఉన్నారన్నారు. ఆ భాష చదువుకున్న వర్గాలే ఆధిపత్యం చెలాయిస్తున్నారని క్లియర్‌గా అర్థమవుతోందని చెప్పారు.
ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో క్యాస్ట్సర్వే రిపోర్ట్‌పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలువురు మేధావులు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల లీడర్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్యాస్ట్సర్వే కమిటీ వైస్చైర్మన్ప్రొఫెసర్కంచ ఐలయ్య మాట్లాడుతూ.. రిజర్వేషన్లు వందేండ్లున్నా..ఇంగ్లిష్ రాకపోతే బీసీ, దళిత కులాల్లో మార్పు అస్సలే రాదన్నారు.
జనాభాలో 0.4 శాతం ఉన్న వెల్మలు అధికారాన్ని దక్కించుకుంటున్నారని, అంటే లక్షా రెండు వేల మంది కొన్ని కోట్ల మందిని శాసిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బ్రాహ్మణులు 0.9 శాతం ఉన్నారని, వారి చేతుల్లో రోడ్లపై నడిచే కార్లలో 16.4 శాతం ఉన్నాయన్నారు. అంటే వారు ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందారో తెలుస్తుందని చెప్పారు. మన రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం చదువులు గ్రామస్థాయిలో మరింత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఆ భాషలో చదువు మారుమూల ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల్లో ఉన్నవారికి చేరినప్పుడే వారి అభివృద్ధి మొదలవుతుందన్నారు. ముఖ్యంగా కుల జనాభా లెక్కలు చూడవద్దని, ఏ కులం ఎంత వెనుకబడి ఉంది అనేది చూడాలని పేర్కొన్నారు. ఇంగ్లిష్ నేర్చుకునే వారిలో ఆదివాసీల తర్వాతే తన కులస్తులైన కుర్మలు కూడా ఉన్నారన్నారు. రిజర్వేషన్లు ప్రైవేట్సెక్టార్కు మారుస్తున్న క్రమంలో జాబ్స్ప్రైవేట్సెక్టార్లో రావాలన్నా గ్రామ స్థాయిలో ఇంగ్లిష్‌మీడియం స్కూల్స్కోసం పోరాడాలన్నారు. ఇంగ్లిష్ ఎక్కువ వచ్చిన వాళ్లే అమెరికా, యూరప్పోతున్నారని, రానివాళ్లు దుబాయ్, గల్ఫ్పోతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాల్గొనవద్దని చెప్పింది..
సర్వే చేస్తున్నప్పుడు అందులో పాల్గొనవద్దని బీఆర్ఎస్ముఖ్య లీడర్లు, వారి అనుచరులు, పార్టీ వారికి సూచించిందని ప్రొఫెసర్ఐలయ్య ఆరోపించారు. మొత్తంగా 12 లక్షల మంది నో క్యాస్ట్ కింద నమోదయ్యారని తెలిపారు. అసలు నో క్యాస్ట్అనేది అసలు భారతదేశంలో ఉంటుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్చేసిన ఒక్కరోజు సర్వేపై విమర్శలు గుప్పించారు. ‘‘క్వశ్చనీయర్లేదు, మాన్యువల్లేదు, కోడ్‌లేదు , కంప్యూటర్డేటా లేదు..అది కూడా సర్వే అంటే మన విద్యా వ్యవస్థ నాశనమైనట్టేనని’’ అన్నారు.
సర్వేకు వేసిన కమిటీలో మొత్తం 9 మంది ఉంటే అందులో తానొక్కడినే బీసీని అని, మిగిలినవాళ్లంతా అగ్రవర్ణాలే అని ప్రొఫెసర్ఐలయ్య అన్నారు. విద్యార్థులు, మేధావులు ఈ సర్వే రిపోర్ట్ పై క్షుణ్నంగా అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. తాము సర్వే రిపోర్టులో 67 ముఖ్యమైన ప్రశ్నలు, 26 ఉప ప్రశ్నలు పెట్టామన్నారు. 18 అగ్రకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ పెట్టామని, అదర్స్అని మెన్షన్ చేశామని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం నో క్యాస్ట్ పెట్టామన్నారు. నో రిలీజియన్ కూడా పెట్టామని తెలిపారు. తెలంగాణలో క్యాస్ట్సర్వే జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా సర్వే జరగాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 80 ఏండ్లుగా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవ్వడానికి కారణాలను ఈ సర్వే రిపోర్టు స్పష్టం చేస్తుందని చెప్పారు.
రాజ్యాంగమంత పవర్ ఫుల్: ప్రొఫెసర్ సింహాద్రి
ఈ సర్వే రిపోర్ట్రాజ్యాంగమంత పవర్ఫుల్అని తెలంగాణ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాస్ట్ సర్వేలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని క్లియర్‌గా తెలుస్తోందన్నారు. సర్వే రిపోర్ట్ చూసైనా తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఆధిపత్య వర్గాలు తమకు అవసరం లేకున్నా ఈడబ్ల్యూఎస్రిజర్వేషన్లను సాధించుకున్నాయని, దీనివల్ల అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేస్తున్నాయని ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వర్రావు, ప్రొఫెసర్ చిన్న బస్వయ్య ఆరోపించారు. సామాజిక న్యాయం అందాలంటే అట్టడుగు వర్గాలు ఆర్థిక రాజకీయ చైతన్యం పొందాలని సూచించారు. ప్రొఫెసర్ తిరుపతి కుమార్ పాల్గొన్నారు.
