ఎండలు దంచుతున్నయ్..డ్యూటీ టైమింగ్స్ మార్చండి

ఎండలు దంచుతున్నయ్..డ్యూటీ టైమింగ్స్ మార్చండి
  •     సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్​ యూనియన్​ విజ్ఞప్తి

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌‌ల వద్ద ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పనివేళలను మార్చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్  ఏరియా కార్యదర్శి కుంట ప్రవీణ్​కుమార్​ కోరారు. ఆదివారం ఆర్జీ 2 ఏరియా ఓసీపీ 3 కృషి భవన్ వద్ద యాక్టింగ్ మేనేజర్ లక్ష్మణరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణి ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీలు దాటుతున్నాయన్నారు.

మార్నింగ్​ షిఫ్ట్‌‌ను 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రెండో షిఫ్ట్‌‌ను సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించాలని సూచించారు. కూలింగ్​ విశ్రాంతి షెల్టర్లను ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే వాటర్ ట్యాంకర్ల ద్వారా రోడ్లపై ప్రతిరోజూ నీటిని చల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉల్లి మొగిలి, వినేష్, శివకుమార్, రాజేందర్, సంతోష్, తిరుపతి, శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.