కరోనా క్రైసిస్‌‌‌‌తో.. ఉద్యోగాల తీరు మారింది

కరోనా క్రైసిస్‌‌‌‌తో.. ఉద్యోగాల తీరు మారింది
  • ప్రపంచ కల్చర్ కూడా చేంజ్ అయింది 
  • ‘‘స్కిల్, కొత్త స్కిల్.. అడిషనల్ స్కిల్ ’’ అన్నదే యూత్ మంత్రం కావాలె
  • యువతకు మోడీ పిలుపు 
  • ‘స్కిల్ ఇండియా మిషన్’కు ఐదేళ్లయిన సందర్భంగా స్పీచ్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ క్రైసిస్ కారణంగా బిజినెస్, మార్కెట్ వేగంగా మారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘స్కిల్, కొత్త స్కిల్, అడిషనల్ స్కిల్’’ అన్నదే యువత మంత్రం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కమ్ముకున్న ప్రస్తుత సమయంలో ‘‘స్కిల్స్’’కు చాలా ప్రాధాన్యం ఏర్పడిందని, యూత్ ఇప్పుడు వీటిపైనే ఫోకస్ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ‘స్కిల్ ఇండియా మిషన్’కు ఐదేళ్లు అయిన సందర్భంగా బుధవారం ఒక వర్చువల్ ప్రోగ్రాంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రస్తుతం వేగంగా మారిపోతున్న ప్రపంచంలో లక్షలాది మంది స్కిల్డ్ ఎంప్లాయీస్ అవసరం ఉందని, ప్రధానంగా హెల్త్ సర్వీసెస్ లో స్కిల్డ్ ఉద్యోగులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా క్రైసిస్ ఉద్యోగాల తీరుతో పాటు ప్రపంచ కల్చర్ ను కూడా మార్చేసిందన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీలు కూడా ప్రపంచంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. మారుతున్న వర్క్ కల్చర్, ఉద్యోగాల తీరును బట్టి కొత్త స్కిల్స్ ను సంపాదిస్తేనే భవిష్యత్ బాగుంటుందని ఆయన యువతకు సూచించారు.

కమర్షియల్ షిప్పింగ్ కు మస్త్ ఫ్యూచర్..
ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ షిప్పింగ్ (మర్చంట్ నేవీ) రంగంలో ఉపాధికి భారీ ఎత్తున అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోడీ చెప్పారు. ఈ రంగంలో స్కిల్స్ పెంచుకుంటే ప్రపంచానికి మనం లక్షలాది మంది ఎక్స్ పర్ట్ నావికులను అందించగలమని ఆయన అన్నారు.

స్కిల్స్ తోనే ఉద్యోగం.. ఉపాధి
‘ప్రస్తుతం బిజినెస్, మార్కెట్స్ వేగంగా మారిపోతున్నాయని, ఈ పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారాలో అర్థం కావడంలేదని చాలా మంది నన్ను అడుగుతుంటారు. దీనికి నా జవాబు ‘స్కిల్, కొత్త స్కిల్, అడిషనల్ స్కిల్’’ అని ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. ‘‘స్కిల్ కు టైం పీరియడ్ అనేది ఉండదు. అది కాలంతో పాటు మెరుగవుతుంది. అది మిమ్మల్ని ఇతరుల కంటే డిఫరెంట్ గా నిలబెడుతుంది. స్కిల్ అనేది సంపద. స్కిల్ ఉంటే ఉద్యోగమే కాదు స్వయం ఉపాధి పొందేందుకూ చాన్స్ ఉంటుంది’’ అని ప్రధాని చెప్పారు.

‘స్కిల్ ఇండియా’తో ఎన్నో అవకాశాలు..
ఐదేళ్ల క్రితం ఇదే రోజున స్కిల్ ఇండియా మిషన్ ప్రారంభమైందని, అది దేశంలో భారీ ఎత్తున స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కు సౌలతులను కల్పించిందని ప్రధాని అన్నారు. ఈ మిషన్ తో పెద్ద ఎత్తున యువత స్కిల్స్ ను సంపాదించి, దేశవిదేశాల్లో ఉపాధి పొందేందుకు ఎన్నో అవకాశాలు వచ్చాయన్నారు.

‘కేదార్ నాథ్’ పనులపై పీఎం రివ్యూ..
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ వద్ద పర్యాటకులకు వసతుల కోసం కొనసాగుతున్న పనులను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సమీక్షించారు.

ఈయూతో సంబంధాలు బలోపేతం..
ఇండియా-ఈయూ సమిట్ వల్ల యూరప్‌తో మన దేశ ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని మోడీ అన్నారు. ఇండియా,యూరోపియన్ యూనియన్ 13 ఏళ్ల తర్వాత మంగళవారం సివిల్ న్యూక్లియర్ కో ఆపరేషన్ అగ్రిమెంట్‌ను ఖరారుచేశాయి.
బుధవారం ఇండియా–ఈయూ వర్చువల్ మీట్ కు ఒకరోజు ముందుగా ఈ డీల్ జరిగింది.

For More News..

సర్కారీ పోర్టల్ హ్యాక్ చేసిన అన్నదమ్ములు

వట్టి డిగ్రీలతో లాభం లేదు