పంజాబ్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్

పంజాబ్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: పంజాబ్ లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై  విచారించాలని  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మోడీ పర్యటనకు దురుద్దేశపూర్వకంగా అడ్డంకి సృష్టించారని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మణిందర్ సింగ్ ఆరోపించారు. పిటిషన్ కాపీలను  కేంద్రంతోపాటు పంజాబ్ ప్రభుత్వానికి పంపాలని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. రేపు కేసును కోర్టు విచారిస్తుందన్నారు. 

కాగా, మోడీ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై విచారణకు పంజాబ్ సీఎం చన్నీ ఆదేశించారు. ఈ మేరకు సర్కార్ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్  జడ్జి మెహతాబ్  సింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాగ్ శర్మతో  కూడిన కమిటీని ప్రకటించింది. మూడ్రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని పంజాబ్ సర్కార్ ఆదేశించింది. 

మరిన్ని వార్తల కోసం:

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ బాటలో ‘వలిమై’

మోడీ జీ.. 15 నిమిషాలు ఆగలేరా?

తెలుగు షోలలో ‘అన్‌స్టాపబుల్‌’