తిరుమలలో ప్రధాని మోదీ..  నవంబర్​ 27న శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని

తిరుమలలో ప్రధాని మోదీ..  నవంబర్​ 27న శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని

ప్రధాని మోదీ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి, తిరుమలలో ప్రధాని మోది రెండు రోజులు పర్యటించనున్నారు.  రేపు ( నవంబర్​ 27) తిరుమల శ్రీవారికి దర్శించుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ , మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్వాగతం పలికారు.  

అనంతరం తిరుమలలోని శ్రీరచనా అతిథి గృహంలో ప్రధాని మోదీ ఈ రాత్రికి బస చేయనున్నారు.  అక్కడ టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, శ్రీ రచనా అతిధి గృహాల డోనార్ తుమ్మల రచనా చౌదరి స్వాగతం పలికారు. మోదీ పర్యటన సందర్భంగా తిరుమల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.  భద్ర తా ఏర్పాట్లలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు,2014లో ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించాక 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి శ్రీవారిని ప్రధాని మోడీ రేపు (నవంబర్​ 27)  దర్శనం చేసుకోనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.