హైదరాబాద్ లో 160 కిలోమీటర్ల మోదీ మెగా రోడ్ షో

హైదరాబాద్ లో 160 కిలోమీటర్ల మోదీ మెగా రోడ్ షో

ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింతగా హోరెత్తిస్తున్నాయి.  నవంబర్ 27  సోమవారం రోజున ప్రధాని మోదీ హైదరాబాద్ లో  భారీ ర్యాలీ చేపట్టనున్నారు.  24 నియోజకవర్గాల్లో 166 కి.మీల భారీ రోడ్ షోకు రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది.  

ముషీరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ రోడ్‌షో సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట్, యాకత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, శేర్లింగంపల్లి, చార్మినార్, రాజేంద్రనగర్ మీదుగా జరిగి  గోషామహల్‌లో ముగుస్తుంది.

ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి నారాయణగూడ, వైఎంసీఏ కాచిగూడ జంక్షన్ల మీదుగా జరిగే రోడ్‌షోలో ప్రధాని పాల్గొని కాచిగూడలోని వీర్ సావర్కర్ విగ్రహం వద్ద ప్రసంగిస్తారు.  మోదీ భారీ ర్యాలీలో  బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు.  మోదీ భారీ ఎన్నికల రోడ్ షో కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది కాబట్టి  ప్రత్యామ్నాయలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. 

ప్రధాని  భారీ ఎన్నికల రోడ్ షో  నేపథ్యంలో కేంద్ర బలగాలు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి.  కాగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.  డిసెంబర్ 03న ఫలితాలు వెలువడనున్నాయి.