హైదరాబాద్ పబ్లిక్​కు మరింత మేలు

హైదరాబాద్ పబ్లిక్​కు మరింత మేలు

హైదరాబాద్, వెలుగు: ఎంఎంటీఎస్ నెట్​వర్క్ 90  కిలోమీటర్లకు పెరగడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్-సికింద్రాబాద్ ప్రజలకు, శివారు ప్రాంతాల వారికి ఎంఎం టీఎస్ సేవలు ఎంతో ఉపయోగపడతా యని శుక్రవారం ట్వీట్  చేశారు. ఎంఎంటీఎస్  నెట్​వర్క్ పెరగడంతో  ఓ ఇంగ్లిష్  పేపర్​లో వచ్చిన క్లిప్పింగ్​ను దక్షిణ మధ్య రైల్వే అఫీషియల్ ట్విట్టర్  అకౌంట్​లో షేర్  చేయగా, ఆ ట్వీట్​కు ప్రధాని రీ ట్వీట్ చేశారు. ఈనెల 8న మోడీ హైదరాబాద్  పర్యటనలో సికిం ద్రాబాద్-మేడ్చల్, ఫలక్​నుమా-ఉందా నగర్ మధ్య ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా కొత్త ట్రైన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే.