రికార్డు సంఖ్యలో ఓటు వేయాలి : ఛత్తీస్‌గఢ్, మిజోరాం ప్రజలకు మోదీ పిలుపు

రికార్డు సంఖ్యలో ఓటు వేయాలి : ఛత్తీస్‌గఢ్, మిజోరాం ప్రజలకు మోదీ పిలుపు

ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన క్రమంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. "ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాస్వామ్యానికి పవిత్రమైన పండుగ. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లందరూ ఓటు వేసి ఈ పండుగలో భాగస్వాములు కావాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్రంలో మొదటిసారి ఓటు వేస్తోన్న యువ స్నేహితులందరికీ నా ప్రత్యేక అభినందనలు" అని మోదీ Xలో పోస్ట్‌‌ చేశారు.

"రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని మిజోరాం ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను. యువకులు, మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారు ఈ ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు.