మోడీకి ఘన స్వాగతం పలికిన బీజేపీ లీడర్లు

మోడీకి ఘన స్వాగతం పలికిన బీజేపీ లీడర్లు

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ముగించుకుని.. హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి.. గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోడీకి స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట్ ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీ నిర్వహించారు. ఈ సభకు బీజేపీ ముఖ్య నేతలతో పాటు13 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. 

సభా వేదికపై మోడీని బీజేపీ ముఖ్య నేతలు సన్మానించారు. రామగుండం పునరుద్దరణతో ఎరువుల కష్టాలు పోయాయని బీజేపీ ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. మోడీ పర్యటన నేపథ్యంలో 1500 మంది పోలీసులతో బేగంపేట్ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో 100 మంది కేంద్ర బలగాలతో నిఘా పెట్టారు. 2గంటల 15నిమిషాలకి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రామగుండానికి ప్రధాని వెళ్లనున్నారు. 3గంటల 30 నిమిషాలకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మోడీ సందర్శించనున్నారు. రామగుండంలో 4గంటల 15నిమిషాలకు బహిరంగ సభ ఉండనుంది. ఈ సభలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.