తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తిరుపతిలో బీజేపీ ఏర్పాటుచేసిన ప్రజా ధన్యవాద సభకు హాజరయ్యారు మోడీ. సభ ముగిసిన తర్వాత స్వామని దర్శించుకునేందుకు తిరుమల చేరుకున్న మోడీకి తెలుగు రాష్ట్రాల గవర్నర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానితో పాటు వారు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారిని ఆశీర్వ దించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.