సంప్రదాయ సౌత్ ఇండియన్ లుంగీలో మోదీ.. వీడియో వైరల్

సంప్రదాయ సౌత్ ఇండియన్ లుంగీలో మోదీ.. వీడియో వైరల్

ఢిల్లీలోని రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారత సంప్రదాయమైన లుంగీ కట్టుకుని కనిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పూజలు చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో మోదీ నల్లకోటుతో పాటు తెల్లటి లుంగీని ధరించి ఉన్నట్టు వీడియోలో చూడవచ్చు. ప్రధాని ఎడమ భుజంపై శాలువా కూడా వేసుకుని కనిపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎంఓఎస్ ఎల్ మురుగన్ నివాసంలోకి ప్రవేశించి వేడుకల్లో పాల్గొంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా మురుగన్ నివాసానికి హాజరయ్యారు. మోదీ వంట కోసం నిప్పంటించిన కంటైనర్‌కు దగ్గరకు.. ఆ తర్వాత మండపం లోపల నిలబడి ఉన్న ఆవు వైపుకు వెళ్లారు. అనంతరం ఆవుకు పూలమాల వేసి, దానికి దానా తినిపించారు.