
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు పుట్టినరోజు విషెస్ తెలిపారుప్రధాని మోదీ. ప్రేమ, సహనం,నైతిక క్రమశిక్షణకు దలైలామా చిహ్నం అన్నారు. దలైలైమా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ జూలై 6, 2025న (శనివారం) తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
దలైలామా 1935లో టిబెట్‌లోని టక్‌సెర్‌లో జన్మించారు. 1959లో చైనా ఆక్రమణ తర్వాత భారత్ లో ఆశ్రయం పొంది అప్పటినుండి ధర్మశాలలో నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింస, మానవతా విలువలను ప్రచారం చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు.
దలైలామా జయంతి వేడుకలు
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు ఆదివారం నాటికి 90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మెక్లియోడ్‌గంజ్‌లోని టిబెటన్లు ఆదివారం నుంచి వారం రోజుల పాటు దలైలామా జయంతి వేడుకలను జరుపుకుంటారు. దలైలామ జన్మదిన వేడుకల్లో భాగంగా మతపరమైన సమావేశం, యువజన వేదిక, చలనచిత్ర ప్రదర్శన,టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దీర్ఘాయుష్షు కోసం ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
►ALSO READ | యాదిలో.. అతివాదుల నాయకుడు
దలైలామా తన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచానికి ఓ సందేశాన్ని అందించారు. మానవ విలువలు, మత సామరస్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తూనే ఉంటానని నొక్కి చెప్పారు.