జాతీయ క్రీడలు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

జాతీయ క్రీడలు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ గుజరాత్ వెళ్లారు. ఇందులో భాగంగా గుజరాత్ లో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ప్రధాని నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. సూరత్, భావ్ నగర్, అహ్మదాబాద్, అంబాజీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. మొత్తం 29 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ మొదలుపెడతారు. అహ్మదాబాద్ లో మెట్రో ఫస్ట్ ఫేస్, సూరత్ లో బయోడైవర్సిటీ పార్కును, దేశార్ లో స్వర్ణిమ్ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. సూరత్ లో 3 వేల 4 వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

మరోవైపు గుజరాత్ లో తొలిసారిగా జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే నేషనల్ గేమ్స్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్ జట్టు నుంచి మొత్తం 7 వేల మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్ లో పతకాల కోసం పోటీలుంటాయి. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్ కోట్, భావ్ నగర్ సిటీల్లో మ్యాచ్ లు జరుగుతాయి. సైక్లింగ్ ఈవెంట్ ను మాత్రం న్యూఢిల్లీలో నిర్వహంచనున్నారు. అక్టోబర్ 1 నుంచి చైనాలో టేబుల్ టెన్నిస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. దీంతో టీటీ పోటీలను ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించారు. కబడ్డీ, లాన్ బౌల్స్, రగ్బీ పోటీలు మొదలయ్యాయి. ఏడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. చివరిసారిగా 2015లో కేరళలో నేషనల్ గేమ్స్ జరిగాయి.