PM మోడీ బయోపిక్ ‘ట్రైలర్’ మిస్సింగ్

PM మోడీ బయోపిక్ ‘ట్రైలర్’ మిస్సింగ్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ అఫీషియల్ ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి తీసేశారు. ఇటీవల ఈ సినిమా విడుదలపై వివాదం నడిచింది. ఏప్రిల్ 11న విడుదల చేయాలని చిత్రయూనిట్ అనుకున్నప్పటికీ… ఎలక్షన్ కమిషన్ అడ్డు చెప్పింది. ఓటర్లపై ప్రభావం పడుతుందని దాఖలైన ఫిర్యాదులపై స్పందించిన ఎలక్షన్ కమిషన్.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను అనుసరించి.. ఈ సినిమా విడుదలను ఆపాలని నిర్ణయించింది. సినిమాకు సంబంధించిన పోస్టర్, వీడియోలు ఎక్కడా కనిపించనీయొద్దని సినిమా మేకర్స్ కు సూచించింది. సినిమా విడుదలకు సుప్రీంకోర్టు అంగీకరించినప్పటికీ.. మోడీ బయోపిక్ రిలీజ్ ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేసింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అన్న సందేహాలు ఇంకా తొలగి పోకముందే…. తాజాగా.. యూట్యూబ్ లో PM మోడీ బయోపిక్ అఫీషియల్ ట్రైలర్ ను తీసేశారు.