శంషాబాద్ లో ఏర్పాటు చేసిన భారతదేశంలోని అతిపెద్ద స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్( ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ )ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు . అనంతరం దేశంలోనే తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. స్కైరూట్ క్యాంపస్ ప్రారంభోత్సవం యువత శక్తికి నిదర్శనం అని అన్నారు. గ్లోబల్ శాటిలైట్ వ్యవస్థలో భారత్ లీడర్ గా మారనుందన్నారు.స్కైరూట్ లాంఛింగ్ తో యువతో నమ్మకం పెరుగుతుందన్నారు.అంతరిక్ష రంగంలో ఇదో మైలు రాయి అని తెలిపారు. భారత్ అంతరిక్ష రంగంలో మరిన్న ఘనతలు సాధిస్తుందన్నారు. భారతీయ స్పేస్ సెక్టార్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు మోదీ. సైకిల్ పై నుంచి రాకెట్ తీసుకెళ్లే స్థాయి నుంచి ప్రస్థానం మొదలైందన్నారు. ప్రపంచంలో చిన్న చిన్న శాటిలైట్లకు డిమాండ్ పెరిగిందన్నారు రాబోయే కాలంలో శాటిలైట్ ఎకానమీ భారీగా పెరుగుతుందన్నారు.
ప్రపంచంలోని కొన్నిదేశాల్లోనే అంతరిక్ష పరిజ్ఞానం ఉందన్నారు మోదీ. భారత శాటిలైట్లు తక్కువ ఖర్చుతో నమ్మదగినవిగా ఉన్నాయని చెప్పారు. భారత్ లోని జెన్ జీ యువతకు క్రియేటివిటీ సొంతమన్నారు.
