పీఎంఎల్‌-ఎన్‌ ప్రజాతీర్పుని మార్చడానికి ప్రయత్నించింది: ఇమ్రాన్ ఖాన్

పీఎంఎల్‌-ఎన్‌ ప్రజాతీర్పుని మార్చడానికి ప్రయత్నించింది: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు గెలుచుకోలేదు. దీంతో అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇమాన్ ఖాన్, ఆయన అపోసిషన్ అయిన నవాజ్ షరీఫ్ ఇద్దరూ తామే గవర్నమెంట్ ఫాం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ లేటుగా అయిన బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ తెహ్రీక్- ఇన్సాఫ్ (PTI) పార్టీ ఛైర్మన్ గోహర్ ఖాన్ కు, తన పార్టీ ఆదేశాన్ని గౌరవించాలని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించాడు.     పాకిస్థన్ లో గవర్నమెంట్ ను ఎవరు ఏర్పాటు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 101 సీట్లను పాకిస్థాన్ మాజీ సీఎం ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచింది. ఎన్నికల్లో అవినీతి జరిగిందని ఆయన కోర్టులో పిటీషన్ వేశారు. నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ ప్రజా తీర్పును మార్చడానికి ప్రయత్నించిందన ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు నిరసన వ్యక్తం చేశారు.