పెనుబల్లి మండలంలోని ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు

పెనుబల్లి మండలంలోని ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు

పెనుబల్లి, వెలుగు : పెనుబల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆటో డ్రైవర్ వేల్పుల రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రోజూ విద్యార్థులను పాఠశాల నుంచి ఇంటికి చేర్చే క్రమంలో, సదరు మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కొన్ని రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. 

ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు తెలపడంతో, వారు వెంటనే వీఎం బంజరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు