మైనర్ పట్ల అసభ్య ప్రవర్తన.. కొరియోగ్రాఫర్ కృష్ణపై ఫోక్సో కేసు..

మైనర్ పట్ల అసభ్య ప్రవర్తన.. కొరియోగ్రాఫర్ కృష్ణపై ఫోక్సో కేసు..

టాలీవుడ్ లో  మరో కొరియోగ్రాఫర్ పై ఫోక్సో కేసు నమోదైంది. ఇటీవలే కొరియోగా గ్రాఫర్  జానీపై లైంగిక ఆరోపణలు కలకలం రేపిన  ఘటన మరిచిపోకముందే.. టాలీవుడ్ లో అలాంటి ఘటనే మళ్లీ జరిగింది.  ఓ మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో  ఢీ షో  కొరియోగ్రాఫర్ కృష్ణ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు అయ్యింది.   జులై 9న  కొరియోగ్రాఫర్ కృష్ణ పై గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదవ్వగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో  బాలిక కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.  దీంతో కొరియోగ్రాఫర్ కృష్ణపై  పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు . కేసు నమోదు అనంతరం  కృష్ణ  అజ్ఞాతంలోకి వెళ్లగా.. బెంగుళూరులోని తన అన్న నివాసంలో పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కంది జైలుకు తరలించారు  గచ్చిబౌలి పోలీసులు. 

ఇటీవలే కొరియోగ్రాఫర్ కృష్ణకు ఓ మహిళతో వివాహం జరిగింది.  భార్యకు  సంబంధించిన  రూ. 9.50 లక్షల నగదు  కృష్ణ తీసుకెళ్లాడని.. గతంలో కూడా కృష్ణ మాస్టర్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ స్టాగ్రమ్  ద్వారా పలువురు యువతుల్ని, మహిళని  మోసం చేసినట్లు కృష్ణ పై అభియోగాలు ఉన్నాయి.

ప్రముఖ తెలుగు ఛానల్ లో రియాల్టీ డ్యాన్స్ షో ఢీలో  మాస్టర్ గా చేశాడు కృష్ణ. అలాగే  డ్యాన్స్  ఐకాన్ 2 విన్నర్ గా, బీబీ జోడీ షో విన్నర్ గా గెలిచాడు.