డబ్ల్యూటీఏ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇగా స్వైటెక్

డబ్ల్యూటీఏ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇగా స్వైటెక్

కనాకున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మెక్సికో) : పోలెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇగా స్వైటెక్ ఒక విజయంతో రెండు ఘనతలు సాధించింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మళ్లీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వన్​ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో స్వైటెక్ 6–1, 6–0తో జెస్సికా పెగులా (అమెరికా)పై నెగ్గింది.

పెట్రా క్విటోవా (21 ఏళ్లు) తర్వాత ఈ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన యంగెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్వైటెక్ (22 ఏళ్లు) రికార్డులోకెక్కింది. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరే క్రమంలో ఒక్క సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కోల్పోని స్వైటెక్.. ఫైనల్లోనూ అదే జోరును చూపెట్టింది. ఈ ఓటమితో పెగులా వరుస 9 విజయాలకు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది.