చైనా మార్కెట్లో హువావే కంపెనీ కొత్త ఫోన్ 'మేట్ XT 2 అల్టిమేట్ డిజైన్' (Mate XT 2 Ultimate Design)ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఒకేసారి మూడు భాగాలుగా మడతపెట్టే (Tri-fold) వినూత్నమైన ఫోన్. గతంలోనూ ఇలాంటి ఫోన్‌ను తెచ్చిన హువావే, ఈసారి దీంట్లో మరిన్ని లేటెస్ట్ మార్పులు చేసింది. ......
1. డిజైన్ , మడతపెట్టే విధానం:
ఈ ఫోన్‌ను మనం రెండు వైపుల నుండి చాలా ఈజీగా ఓపెన్ చెయ్యొచ్చు. మడతపెట్టే ఫోన్లలో సమస్య వచ్చే మన్నిక (Durability) కోసం కంపెనీ దీన్ని చాలా బలంగా తయారు చేసింది. దీనికి ప్రత్యేకమైన హింజ్‌లు (మడతలు తిరిగే భాగాలు), దుమ్ము, నీటి నుండి రక్షణగా ఉండే IP58, IP59 సర్టిఫికేషన్‌లు పొందాయి. ముందు స్క్రీన్ మీద బలమైన గ్లాస్'ను, లోపలి ప్రైమరీ స్క్రీన్ మీద UTG గ్లాస్ & కార్బన్ ఫైబర్‌ను వాడారు. దీనివల్ల ఫోన్‌లో ఎటువంటి మడతలు కనిపించవు.
2. శక్తివంతమైన ప్రాసెసర్ :
ఈ ఫోన్‌లో కొత్త కిరిన్ 9050 ప్రో (Kirin 9050 Pro) చిప్‌సెట్‌ను వాడారు. దీనివల్ల పాత మోడల్‌తో పోలిస్తే ఫోన్ స్పీడ్ 42 శాతం ఎక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఫోన్‌లో ఏఐ (AI) ఫీచర్లు చాలా బాగా పనిచేస్తాయి.
3. కెమెరా ప్రత్యేకతలు:
ఫోటోల కోసం ఇందులో ట్రూ-టు-కలర్ కెమెరా 3.0 సిస్టమ్‌ను ఇచ్చారు. ఇది రంగులను కచ్చితంగా (95 శాతం మెరుగ్గా) క్యాప్చర్ చేస్తుంది. ఇందులో మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ లెన్స్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. మనం ఫొటోలు లేదా వీడియోలు తీసుకునేటప్పుడు ఆహారం, ప్రకృతి దృశ్యాలకు తగినట్లుగా కెమెరా ఆటోమేటిక్‌గా సెట్టింగ్‌లను సూచిస్తుంది.
4. భద్రత, గోప్యత (Privacy):
మన డేటాను కాపాడుకోవడానికి 'స్మార్ట్ షీల్డ్' ప్రైవసీ స్క్రీన్ ఉంది. కవర్ మీద రెండుసార్లు ట్యాప్ చేయడం ద్వారా లేదా ఒక బటన్ నొక్కడం ద్వారా ఈ ప్రైవసీ మోడ్‌ను ఆన్ చేసుకోవచ్చు. మొబైల్ సిగ్నల్ లేని చోట కూడా వాడేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్ సౌకర్యం ఉంది.
5. సాఫ్ట్‌వేర్ అండ్ పెద్ద స్క్రీన్ అనుభవం
ఇది హార్మొనీఓఎస్ 7 (HarmonyOS 7) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీని పెద్ద స్క్రీన్‌పై ఒకే సమయంలో మూడు వేర్వేరు యాప్‌లను పక్కపక్కనే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా వాటి సైజులను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. అంతేకాకుండా, ఇందులో గుండెకు సంబంధించిన ECG విశ్లేషణ వంటి వైద్య సంబంధిత ఫీచర్లు కూడా ఉన్నాయి.
6. ధర &అమ్మకాలు:
చైనాలో ఈ ఫోన్ ధర సుమారు RMB 19,999 అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ. 2,81,572 నుండి ప్రారంభమవుతుంది. దీనితో పాటు ఒక స్టైలస్ అంటే పెన్ లాంటి డివైజ్ కూడా వస్తుంది.
చైనాలో దీని అమ్మకాలు సెప్టెంబర్ 12న ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ఫోన్ భారతదేశంలో ఎప్పుడు విడుదలవుతుంది అనే దానిపై హువావే ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
