మెదక్ టౌన్, వెలుగు: శాంతి భద్రతల దృష్ట్యా జనవరి 31 తేదీ వరకు మెదక్జిల్లావ్యాప్తంగా పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం తన ఆఫీసులో మాట్లాడుతూ నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ –1861 అమలులో ఉంటుందని, పోలీసుల అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక పనులు చేపట్టవద్దని స్పష్టంచేశారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఎస్పీకి సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి
ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకు సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి లభించింది. 2013 గ్రూప్ –1 బ్యాచ్‌కు చెందిన ఆయనకు ప్రస్తుతం జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (జీఏజీ) నుంచి సెలక్షన్ గ్రేడ్ (ఎస్ జీ) కు పదోన్నతి లభించింది. గురువారం నూతన సంవత్సరం నుంచి అమలులోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఆయన సెలక్షన్ గ్రేడ్ హోదాలో విధులు నిర్వహించనున్నారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
