ఏం ఐడియా రా : నల్ల కాగితాలు.. నీళ్లలో కడిగితే 500 నోట్లు అవుతాయి

ఏం ఐడియా రా : నల్ల కాగితాలు.. నీళ్లలో కడిగితే 500 నోట్లు అవుతాయి

అవి నల్ల కాగితాలు.. చూడటానికి అలాగే ఉంటాయి.. చిత్తు కాగితంగా.. కాగితాలకు నలుపు రంగు పూసినట్లుగా ఉంటాయి.. ఆ కాగితాలను నీళ్లలో కడిగితే చాలు.. 500 రూపాయలుగా మారిపోతాయి.. నకిలీ నోట్ల ముఠా కొత్త ఐడియాకు పోలీసులే షాక్ అయ్యారు. పోలీసులకు దొరకకుండా.. కొత్త రకం ఐడియాతో.. నకిలీ నోట్లను మారుస్తున్న ముఠా హైదరాబాద్ సిటీలో వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా చేస్తున్న పనులకు పోలీసులే షాక్ అయ్యారు. ఈ నల్ల కాగితాలు ఏంట్రా అనుకున్న వాళ్లకు.. వాటిని నీళ్లల్లో కడిగితే 500 నకిలీ నోట్లుగా మారటం చూసి అవాక్కయ్యారు. ఈ కేటుగాళ్ల ముఠా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ అమ్ముతున్న విదేశీ ముఠాను  ఇవాళ రాచకొండ పోలీసులు  పట్టుకున్నారు.   ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరొక ప్రధాన నిందితుడు డేవిడ్  పరారీలో ఉన్నారని చెప్పారు.   ఒక లక్ష రూపాయలకు ఐదు లక్షల ఫేక్ కరెన్సీని అమ్ముతున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

 వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ లో అమాయకులను యాడ్ చేస్తున్నారు నిందితులు. తమ వద్ద ఉన్న కాగితాలను కెమికల్లో ముంచితే కరెన్సీ నోట్లుగా మారతాయని పలువురిని నమ్మించారు.  ఇలా  ఇద్దరు వ్యక్తుల వద్ద సుమారు రూ. 5 లక్షలను తీసుకుని పారిపోయారు.  ఫేక్ కరెన్సీ కొన్న వాళ్లు ఇంటికెళ్లి చూస్తే  అన్ని బ్లాక్ పేపర్స్ మాత్రమే ఉండటంతో లబోదిబోమన్నారు బాధితులు.  నిందితులు ఇచ్చే కెమికల్స్ వల్ల మత్తు వస్తుంది.

బోడుప్పల్ కు చెందిన ఓ బాధితుడు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు . ఈక్రమంలో విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు ఆఫ్రికా దేశస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 లక్షల నకిలీ కరెన్సీ, దానికి సంబంధించిన కెమికల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ప్రధాన నిందితుడు డేవిడ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.