గుప్తనిధుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

గుప్తనిధుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

గుప్తనిధుల పేరిట 20 లక్షలు టోకరా వేసిన మహారాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమురం భీం జిల్లా వాంకిడి మండలం ఘట్ జనగాంకు చెందిన కమలాకర్‎కు ముఠా సభ్యులు వల వేశారు. తన నుంచి రూ. 20 లక్షల రూపాయలు కాజేశారని మోసాన్ని గుర్తించిన బాధితుడు కమలాకర్.. వాంకిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ కొండ రమేష్ తన బృందంతో ముఠా గుట్టు రట్టు చేశారు. ఇందాని ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ముఠాను అరెస్ట్ చేశారు.  నిందితుల నుంచి 18లక్షల 3వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‎కు తరలించినట్టు ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు.