
గన్ పార్కులో దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ దీక్షకు దిగిన బండి సంజయ్ ను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. గన్ పార్కు నుంచి ర్యాలీగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి బయలుదేరిన బండి సంజయ్, బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసెంబ్లీ ఎదుట బీజేపీ కార్యకర్తలు భారీగా భైఠాయించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడంతో..అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో అసెంబ్లీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీజేపీ కార్యకర్తలను బలవంతంగా పోలీసులు లాక్కెళ్లే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ బీజేపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు.