హైదరాబాద్ లో రెచ్చిపోతున్న పేకాట రాయుళ్లు

హైదరాబాద్ లో రెచ్చిపోతున్న పేకాట రాయుళ్లు

హైదరాబాద్ నగరంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. హోటల్ రూముల్లో మక్కాం వేసి.. దర్జాగా పేకాట ఆడుతున్నారు. ఈ దాడుల్లో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో పిస్తా హౌస్ హోటల్ లో తనిఖీలు చేపట్టారు. హోటల్ రూమ్ లో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 2 లక్షల16 వేలు, 10 సెల్ ఫోన్లు, 2 కార్లు సీజ్  చేశారు. ఆ తర్వాత వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.