
- 15.13 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు
పంజాగుట్ట,వెలుగు: బెంగళూరు నుంచి డ్రగ్స్తెచ్చి సిటీలో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ అరెస్ట్ చేసింది. అమీర్ పేట్ఎక్సైజ్ పోలీసులు తెలిపిన ప్రకారం.. బంజారాహిల్స్లో ఎండీఎంఏ డ్రగ్స్అమ్ముతున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ టీమ్ దాడి చేసింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 2.65 గ్రాములు ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది.
అతడు ఇచ్చిన సమాచారంతో ఆదిబట్లలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. వారి వద్ద 12.48 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు 326 గ్రాముల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకుని అమీర్పేట్ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారు పలు పబ్బుల్లో డీజేలుగా పని చేస్తున్న అఖిల్, సన్నీగా గుర్తించారు. దాడుల్లో ఎస్టీఎఫ్ సూపరిండెండెంట్ ప్రదీప్రావు, ఇన్స్పెక్టర్ భిక్షారెడ్డి, సబ్ఇన్స్పెక్టర్ బాలరాజు పాల్గొన్నట్టు అమీర్పేట్ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పటేల్ బానోత్ తెలిపారు.