సర్కారు హైరానా! టార్గెట్ కాంగ్రెస్ ?

సర్కారు హైరానా! టార్గెట్ కాంగ్రెస్ ?
  • సర్కారు హైరానా! టార్గెట్ కాంగ్రెస్ ?
  • మారుతున్న అధికార పార్టీ స్టాండ్
  • అర్ధరాత్రి దాటాక సోషల్ మీడియా ఆఫీసుపై పోలీసుల దాడి 
  • కర్నాటక ఫలితాల తర్వాత మారిన బీఆర్ ఎస్ వ్యూహం
  • సునీల్ కనుగోలు స్ట్రాటజీపై 'గులాబీ' ఆపరేషన్!
  •  ఉత్తమ్ కంప్లయింట్ చేశారంటున్న పోలీసులు 5న ఫిర్యాదు చేస్తే.. 16వ తేదీ వరకు ఎందుకు ఆగినట్టు? 
  • పోలీసుల సమాధానంపై అనేక అనుమానాలు

కర్నాటక ఎన్నికల ఫలితాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుందనే భావనకు వచ్చిన బీఆర్ఎస్.. ఆ పార్టీ వ్యూహాలపై ఆపరేషన్ కు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి దాటాక బంజారాహి ల్స్ లోని యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా ఆఫీసుపై సైబర్ క్రైం పోలీసులు దాడి చేశారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నా టక, తెలంగాణ రాష్ట్రాలకు వ్యూహకర్తగా సునీల్ కనుగోలు ఉన్న విషయం తెలిసిందే.

కనుగోలు టీం వ్యూహాలు.. హైదరాబాద్ కేంద్రంగా సాగిన సోషల్ మీడియా ఆపరే షన్లు కర్నాటకలో పార్టీని గెలిపించాయని కాంగ్రెస్ నేతలే బహిరంగ ప్రకటనలు చేశారు. మరో ఐదారు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉండటం, ఇక్కడి వ్యూహకర్త కూడా సునీల్ కనుగోలే కావడంతో అధికార బీఆర్ఎస్.. ఆ పార్టీ స్ట్రాటజీ తెలుసుకునే పనిలో పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఆఫీసుపై సైబర్ క్రైం పోలీసులు దాడి చేశారా? కీలక మైన కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారా? ఆ ల్యాప్ టాప్ లలో ఎలాంటి వ్యూహాలున్నా యి. కీలక సమాచారం ఏమైనా ఉందా..? అనే విషయంలో ఆరా తీస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలా ఉండగా నల్లగొండ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు ఉత్తం కుమార్ రెడ్డి కంప్లయింట్ మేరకే దాడి చేశామని పోలీసులు చెబుతున్నారు. తనను కోవర్టు అంటూ ఓ ఫోన్ నంబర్ నుంచి ట్రోల్ చేస్తున్నారని ఉత్తం కుమార్ రెడ్డి ఈ నెల 5న కంప్లయింట్ చేశారని వారంటున్నారు. ఈ నెల 5న ఉత్తం కుమార్ రెడ్డి ఫిర్యాదు చేస్తే.. 16వ తేదీ వరకు ఎందుకు వేచి చూశారనేది ప్రశ్నార్థకంగా మారింది.