రంగారెడ్డి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి.గుట్టు చప్పుడు కాకుండా ఫాం హౌజ్ లలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. పందేలలో లక్షలలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. పక్కా సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి పందెం రాయుళ్ల ఆటకట్టించారు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలోని బాకారం శివారు లోని ఓ ఫాం హౌజ్ లో కోడి పందేల గుట్టు రట్టు చేశారు. కోడి పందేలు నిర్వహిస్తున్న నిర్వాహకుడితోపాటు పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు రాజేంద్రనగర్ పోలీసులు.
►ALSO READ | దేవుడు పిలుస్తుండు.. మేం కూడా పెద్ద కూతురి దగ్గరికెళ్తం: మూఢనమ్మకాలకు అంబర్పేట్లో ఫ్యామిలీ బలి..!
రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణంరాజుతోపాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.70వేల నగదుతోపాటు 4 కార్టు, 13 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. వీటితోపాటు 18 కోడికత్తులు మొత్తం 22కోళ్లను (15బ్రతికున్న కోళ్లు, 7 చనిపోయిన కోళ్లు) స్వాధీనం చేసుకున్నారు.
గతంలో కూడా మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో కోడి పందేలు నిర్వహిస్తుండగా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. వారిలో దాట్లకృష్ణం రాజుకూడా ఉన్నారు.
