విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తన.. ఆరుగురిపై కేసు

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తన.. ఆరుగురిపై కేసు

ఘట్ కేసర్, వెలుగు: ఫార్మసీ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి దూషించిన ఆరుగురు విద్యార్థులపై కేసు నమోదైంది.  ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం...  ఎన్ఎఫ్ సీ నగర్ సమీపంలోని  మదర్ థెరిస్సా బీ- ఫార్మసీ కాలేజీ విద్యార్థిని(20), గత నెల 29న సాయంత్రం కాలేజీ యాన్యువల్ డే  ఫంక్షన్ ముగిసిన తర్వాత  ఫ్రెండ్స్ తో  వెళ్తుంది. 

అదే కాలేజీకి చెందిన థర్డ్ ఇయర్ విద్యార్థులు సాయి, సిద్ధు, శివ, వినోద్, రంజిత్, మల్లికార్జున్ తో పాటు మరికొందరు ఆమెను అవసరంగా దూషిస్తూ.. అసభ్యంగా ప్రవర్తించారు. ఆందోళనకు గురైన విద్యార్థిని ఘట్ కేసర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.