సమత అత్యాచారం కేసులో చార్జ్ షీట్

సమత అత్యాచారం కేసులో చార్జ్ షీట్

సమత అత్యాచారం,  హత్య  కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.  ఇప్పటికే  ఈ కేసులో  పూర్తిస్థాయిలో దర్యాప్తు పూర్తి చేశారు అధికారులు.  నిందితులకు సంబంధించి  సైంటిపిక్  ఎవిడెన్స్  సేకరించారు. ఫోరెన్సిక్  నివేదిక కూడా ఇప్పటికే  పోలీసులకు అందింది. అందులో వచ్చిన రిపోర్టులను ఛార్జ్ షీట్ లో  ప్రస్తావించనున్నారు  పోలీసులు. సమతను  హత్య చేసేందుకు వాడిన కత్తికి  రక్తం మరకలు,  అత్యాచారం జరిగినట్లు  ఆధారాలపై ఫోరెన్సిక్ రిపోర్టులో  క్లారిటీ ఉందని చెబుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ లో ఫాస్ట్ ట్రాక్  కోర్టు ఏర్పాటు చేయడంతో  కేసు విచారణ  వేగంగా జరిగే అవకాశం ఉంది. 44 మంది సాక్షులను  కూడా విచారించి స్టేట్ మెంట్లు తీసుకున్నారు పోలీసులు. నిందితుల తరపున వాదించకూడదని ఇప్పటికే బార్ అసోసియేషన్ తీర్మానించింది.