
గచ్చిబౌలి, వెలుగు: టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. భారతదేశాన్ని కించపరిచేలా కామెంట్లు చేసిన చిన్మయిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, యూత్ కెన్ లీడ్మెంబర్ ఎం.కుమార్‌సాగర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ యూట్యూబ్చానెల్లో సీనియర్నటి అన్నపూర్ణ మహిళల వస్ర్తధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్‌గా చిన్మయి తన ఇన్‌స్టా అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ‘భారతదేశంలో పుట్టడం నా కర్మ, ఇదో స్టుపిడ్ కంట్రీ’ అని చిన్మయి కామెంట్చేశారని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్నపూర్ణ కామెంట్లపై అభ్యంతరం ఉంటే నేరుగా ఖండించాలని గానీ, ఇలా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. దేశంలో ఉంటూ, ఇక్కడి సౌకర్యాలు అనుభవిస్తూ ఇక్కడ పుట్టడం కర్మ అనడం తమకు కోపాన్ని, బాధను కలిగిస్తున్నాయన్నారు.