డ్రంకన్ డ్రైవ్ టెస్టుతో హడలెత్తించిన పోలీసులు..రెండున్నర గంటల్లోనే 1060 కేసులు

డ్రంకన్ డ్రైవ్ టెస్టుతో హడలెత్తించిన పోలీసులు..రెండున్నర గంటల్లోనే 1060  కేసులు
  •     డ్రంకన్ డ్రైవ్, డ్రగ్స్ డిటెక్టర్స్ చెకింగ్ లు 
  •     పబ్స్ లో స్నిపర్ డాగ్స్, మఫ్టీ పోలీసుల తనిఖీలు
  •     రాత్రి 11 గంటల వరకు 34 కేసుల నమోదు

హైదరాబాద్,వెలుగు: న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి డ్రంకన్ డ్రైవ్ చెకింగ్ లు చేశారు.  గ్రేటర్ సిటీ పరిధిలోని పబ్స్, బార్లు, రిసార్ట్స్ వద్ద పటిష్ట నిఘా పెట్టారు. బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్లు మినహా3 కమిషనరేట్లలోని అన్ని ఫ్లై ఓవర్లు,అండర్ పాస్ బ్రిడ్జిలు మూసివేశారు. 59 ట్రాఫిక్  పీఎస్ ల్లో  మొత్తం 260 చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.  టీ న్యాబ్ పోలీసులు డ్రగ్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించారు.  

నక్లెస్ రోడ్స్,ఎన్టీఆర్ మార్గ్,ట్యాంక్ బండ్ క్లోజ్ చేసినప్పటికీ సెక్రటేరియట్ వద్దకు యువకులు భారీగా చేరగా.. కట్టడి చేయడంలో పోలీసులు చేతులు ఎత్తివేశారు. మరోవైపు డ్రగ్ టెస్టుల్లో పలువురు పట్టుబడినట్లు తెలిసింది. బంజారాహిల్స్,జూబ్లీహిల్స్,గచ్చిబౌలిలోని పబ్స్, బార్లు, రెస్టారెంట్స్ పోలీసులు మఫ్టీలో వెళ్లి చెకింగ్ లు  చేపట్టారు.  స్నిప్పర్ డాగ్స్ ను కూడా వెంట తీసుకుని వెళ్లారు. రూల్స్ పాటిస్తున్నారా..? లేదా అనేది పరిశీలించారు. 

గంజాయి, డ్రగ్స్ కోసం సెర్చ్ చేశారు. చెక్ పాయింట్స్ వద్ద డ్రగ్స్ టెస్టులు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో రాత్రి 11. 30 గంటల వరకు  మొత్తం 1060  కేసులు నమోదు చేశారు. పోలీసుల తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ సప్లయర్లు అరెస్ట్ అయ్యారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు, డ్రగ్  టెస్టుల కేసుల వివరాలను సోమవారం వెల్లడిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు.