రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజాపై పోలీసుల తనిఖీలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజాపై పోలీసుల తనిఖీలు

గోదావరిఖని/జగిత్యాల టౌన్, వెలుగు : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజా అమ్మకాలపై శుక్రవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పతంగులు అమ్మే దుకాణాలకు వెళ్లి చైనా మాంజాపై ఆరా తీశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో చైనా మాంజా అమ్మకాలు చేపట్టవద్దని ముందునుంచే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలను మరింత విస్తృత పరిచారు.   

నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్​కిశోర్​ ఝా హెచ్చరించారు. జగిత్యాల పట్టణంలో టౌన్ సీఐ కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.