
రాష్ట్రవ్యాప్తంగా పలు కేసుల్లో పట్టుకున్న గంజాయిని డిస్పోజ్ చేశారు పోలీసులు. భువనగిరి మండలం తుక్కాపూర్ లోని రోమా ఇండస్ట్రీస్ లో రైల్వే ఎస్పీ చందన ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం. ఈ క్రమంలో కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు ఎస్పీ చందన. 2024 నుంచి ఇప్పటి వరకు 2010.135 కేజీ లు గంజా స్వాధీనం చేసుకున్నామని.. వీటి విలువ రూ. 10 కోట్ల 5 లక్షల 6 వేల 750 ఉంటుందని వెల్లడించారు. మొత్తం 74 కేసుల్లో గంజాయిని పట్టుకున్నామని తెలిపారు.
జాతీయ రహదారులు,సెంటర్ల దగ్గర నిఘాను పటిష్టము చేశామని.. సికింద్రాబాద్ పరిధి లో 49 కేసుల్లో 1419.229 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా వీటి విలువ రూ.7 కోట్ల 09 లక్షల 61 వేల 450గా ఉంటుందని తెలిపారు.
Also Read:-కోమటిరెడ్డి బోళా మంత్రి .. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతరు
సికింద్రాబాద్ రూరల్ పరిధి లో 5 కేసుల్లో 100.842 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని.. వీటి విలువ రూ.50 లక్షల 42 వేల100గా ఉంటుందని తెలిపారు. కాజీపేట డివిజన్ లో 20 కేసుల్లో 490 .064 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా.. వీటి విలువ రూ.2 కోట్ల 45 లక్షల 03 వేల 200గా ఉంటుందని తెలిపారు.