కోమటిరెడ్డి బోళా మంత్రి .. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతరు: బండి సంజయ్

కోమటిరెడ్డి బోళా మంత్రి .. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతరు: బండి సంజయ్

మంత్రి కోమటిరెడ్డి బోళ మంత్రి..మనసులో ఏమి ఉంచుకోడు..ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారని  కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.  మహారాష్ట్ర బార్డర్ లో నేషనల్ హైవేకు శంకుస్థాపన చేశారు. ఈ  సందర్బంగా మాట్లాడిన బండి సంజయ్. రూ. 3526 కోట్లతో 95 కిలోమీటర్ల మేర ఫోర్ లైన్స్ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు.  ఆదిలాబాద్ అనగానే వెనుబడిన అనే అపోహ ఉండేది కానీ..  ఆదిలాబాద్ లో రోడ్లను అభివృద్ధి చేశామన్నారు.

  తెలంగాణ రాకముందు 2500కి.మీ రహదారులు  హైవే ఉండేది.  బీజేపీ అధికారంలోకి వచ్చాక 5100 కి.మీ నేషనల్ హైవేలు నిర్మించాం . దేశంలోని జాతీయరహాదారుల కోసం లక్షా 20 వేల కోట్లు కేటాయించాం.  తెలంగాణకు కేంద్రం రూ. 12 లక్షల కోట్లు కేటాయించింది.  రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే  దేశం విశ్వ గురువు అవుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసేందుకు కేంద్రం సిద్ధం.  హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారులు సరిగా లేవు.  రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా నిర్మించేందుకు కేంద్రం రెడీగా ఉంది.  రాజీవ్ రహదారి నిర్మించిన కాంట్రాక్టర్ సమస్యను పరిష్కరించాలి.  నితిన్ గడ్కరీ ఎవరు ఏది అడిగినా ఇస్తారని బండి సంజయ్ అన్నారు. 

Also Read:-గల్ఫ్కు పంపిస్తామంటూ ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ కాల్..