రిసార్ట్ లో అమ్మాయిలతో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. 52 మంది పురుషులు, 20 మంది మహిళలపై కేసు నమోదు

రిసార్ట్ లో అమ్మాయిలతో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. 52 మంది పురుషులు, 20 మంది మహిళలపై కేసు నమోదు
  • రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలంలో ఘటన 

ఇబ్రహీంపట్నం, వెలుగు: రిసార్ట్ లో​అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా, ఎస్​వోటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలోని కార్పూల్ చంద్రారెడ్డి రిసార్ట్ లో వేద, రాక్ స్టార్ సీడ్స్, ఫెర్టిలైజర్ కంపెనీ మంగళవారం రాత్రి రేవ్ పార్టీ ఏర్పాటు చేసింది. విశ్వసనీయ సమాచారంతో ఆ పార్టీపై ఎస్​వోటి పోలీసులు దాడి చేసి, 72 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 52 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై మహేశ్వరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.