
డ్యూటీ అంటే బాధ్యత. యూనిఫాం అంటే ప్రేమ. అందుకే ఆ కుటుంబంలో మూడు జనరేషన్ల నుంచి పోలీస్ యూనిఫామ్ కంటిన్యూ అవుతోంది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్లోడీఐజీగా ఉన్న ఏపీఎస్ నింబాడియా కుటుంబం ప్రత్యేకత ఇది. ఆయన కూతురు ఆపేక్షా నింబాడియా బార్డర్లో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టింది. ఇటీవల పాసింగ్ ఔట్ పరేడ్‌లో భాగంగా ఆమె తన తండ్రికే సెల్యూట్ చేసింది. ఆమె సెల్యూట్ స్వీకరిస్తూ తండ్రి ఉప్పొంగిపోయాడు. ఈ మధురమైన క్షణాన్ని ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. అంతేకాదు, వారిద్దరి ఫొటోలనూ ఐటీబీపీ అధికారి సోషల్ మీడియా అకౌంట్ పోస్టు చేసింది. ఆపేక్ష ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ పోలీసు అకాడమీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.