కాపర్ వైర్ల బండిల్స్ దొంగల ముఠా అరెస్ట్

కాపర్ వైర్ల బండిల్స్ దొంగల ముఠా అరెస్ట్

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కాపర్ వైర్ల బండిల్స్ ను దొంగిలించిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 38 కాపర్ వైర్ల బండిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న (జూన్ 10న) కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కాపర్ వైర్ల బండిల్స్ చోరీ జరిగింది.

సోను ఖాన్ అనే అంబులెన్స్ డ్రైవర్, బిస్వాస్, రాజన్ బెహర్హాన్ .. అనే వ్యక్తులు కాపర్ వైర్ల బండిల్స్ ను దొంగతనం చేశారని బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వీళ్లు అంతకుముందే నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పని చేస్తున్నారని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ సహాయంతో దొంగతనం చేశారని చెప్పారు. చోరీ చేసిన కాపర్ వైర్ల బాండిల్స్ ను ఎన్ బీటీ నగర్, బల్కంపేట్, ముషీరాబాద్ లోని సురేష్, రాజు మహేష్, హుస్సేన్ అనే వ్యక్తులకు విక్రయించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న స్టోర్ కీపర్ శంకర్ జార్ఖండ్ వెళ్లాడని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని బంజారాహిల్స్ ఏసీపీ చెప్పారు. నిందితుల వద్ద నుంచి రూ. 38 లక్షల విలువ చేసే 38 కాపర్ వైర్ల బండిల్స్, అంబులెన్స్ వాహనాన్ని, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.