నేరెడ్ మెట్, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల డ్యూటీకి ఆటంకం కలిగించి వారిని తిట్టిన ఇద్దరు వ్యక్తులను నేరెడ్ మెట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ నరసింహస్వామి కథనం ప్రకారం..చెంగిచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుశుక్రవారం సాయంత్రం నేరెడ్ మెట్ సాయినాథపురం మీదుగా ఈసీఐఎల్ వెళ్తోంది. బస్సులో డ్రైవర్ పి. కిరణ్ రెడ్డి, కండక్టర్ ఇస్మాయిల్ ఉన్నారు. మౌలాలిలోని మహాత్మాగాంధీనగర్ లో ఉండే జి.శంకర్(23),డి.ఆంజనేయులు(25) అదే రోజు సాయంత్రం బస్సు ఎక్కారు. కండక్టర్ ఇస్మాయిల్ వారిద్దరిని టికెట్ తీసుకోమని అడగగా..వారు వాగ్వాదానికి దిగారు. డ్రైవర్ కిరణ్, కండక్టర్ ఇస్మాయిల్ ను ఆ ఇద్దరు తిడుతూ వారితో దురుసుగా ప్రవర్తించారు.
శంకర్, ఆంజనేయులు తమ డ్యూటీకి ఆటంకం కలిగించి..తమను తిట్టారని డ్రైవర్ కిరణ్నేరెడ్ మెట్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి 341, 353, 323,504, 506 ఆర్/డబ్య్లూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శనివారం వారిని రిమాండ్కు తరలించామని చెప్పారు సీఐ నరసింహ స్వామి తెలిపారు.
