హైదరాబాద్ హయత్ నగర్ లో సినీ ఫక్కీలో జరిగిన యువతి కిడ్నాప్ కేసులో నిందితుడిని గుర్తించారు పోలీసులు. కిడ్నాప్ చేసిన వ్యక్తి విజయవాడలో పాత నేరస్థుడు రవి శంకర్ గా గుర్తించారు పోలీసులు. పోలీస్ కస్టడీ నుంచి తపించుకొని తిరుగుతున్న రవిశంకర్.. వారం రోజుల క్రితం కర్ణాటక లో సీబీఐ ఆఫీసర్ అని చెప్పి కార్ దొంగతనం చేసి వచ్చాడని తెలుస్తోంది. నిందితుడు రవి శంకర్ కోసం కర్ణాటక, విజయవాడలో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు.
ఈ నెల 23న యువతి కిడ్నాప్ అయ్యింది కర్ణాటకలో కారు దొంగిలించి.. సిటీకి వచ్చిన దుండగుడు.. మాయమాటలతో బీ ఫార్మసీ చదువుతున్న యువతిని కిడ్నాప్ చేశాడు. జాబ్ ఇప్పిస్తానని తండ్రిని నమ్మించి కిడ్నాప్ చేశారు. దీంతో కూతురు కిడ్నాప్ అయిందని తెలుసుకుని పోలీసులకు కంప్లయింట్ చేశాడు యాదయ్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
