
హైదరాబాద్,వెలుగు: సిటీలో పలు వ్యాపార సమయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్, పబ్స్, వైన్స్ షాపుల ఓపెనింగ్, క్లోజింగ్ టైమ్‌లను నిర్ధారించారు. సోమవారం నుంచి గురువారం వరకు శుక్ర, శనివారాల్లో షాపుల నిర్వహణకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను నిర్ణయిస్తూ.. హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. వైన్స్‌కు మాత్రం శుక్ర,శని వారాల్లో రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచేలా పర్మిషన్ ఉంటుందని పేర్కొన్నారు.