డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపార వేత్తలకు 14 రోజుల రిమాండ్

డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపార వేత్తలకు 14 రోజుల రిమాండ్

డ్రగ్స్  కేసులో 23 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇందులో 10 మంది నిందితులు పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.  ఈ కేసులో ప్రధాన నిందితుడు టోనీతో పాటు అతని ఏజెంట్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. టోనీతో సంబంధాలున్న నలుగురు వ్యాపారవేత్తలు అశోక్ జైన్, సోమ శశికాంత్, గజేంద్ర ప్రసాద్, సంజయ్ లు పరారీలో ఉన్నారు. అరెస్టయిన ఏడుగురు వ్యాపార వేత్తలను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. 

డ్రగ్ కేసులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు  సీపీ ఆనంద్  . అయితే ఇదంతా హడావుడి తప్పిస్తే కఠిన చర్యలుండవన్న అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. గతంలో డ్రగ్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్, ఆతర్వాత ఈడీ అధికారులు చేసిన హడావుడిని గుర్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా హడావుడి చేసి..తర్వాత కేసుల్ని సైలెంట్ మోడ్ లో పెడతారన్న విమర్శలొస్తున్నాయి.